అక్టోబర్ 2 రేస్ నుంచి ‘సైజ్ జీరో’ తప్పుకోనుందా.?

అక్టోబర్ 2 రేస్ నుంచి ‘సైజ్ జీరో’ తప్పుకోనుందా.?

Published on Aug 31, 2015 8:00 PM IST

size-zero
‘బాహుబలి’ సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేసిన యోగ బ్యూటీ అనుష్క త్వరలోనే మొదలు కానున్న ‘బాహుబలి 2’ సినిమా షూటింగ్ కోసం సిద్దమవుతోంది. బాహుబలి షూట్ ఫినిష్ చేసిన తర్వాత అనుష్క అమాంతం 20 కిలోలు బరువు పెరిగిన చేసిన సినిమా ‘సైజ్ జీరో’. షూటింగ్ మొత్తానికి గుమ్మడికాయ కొట్టేసిన ఈ సినిమా టీం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాని ఒకేసారి అక్టోబర్ 2న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసారు. దాని ప్రకారమే అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి.

కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని అక్టోబర్ 2 రేస్ నుంచి తప్పించి అక్టోబర్లో మరో తేదీకి పోస్ట్ పోన్ చేసే ఆలోచనలో ఈ చిత్ర టీం ఉన్నారట. తమిళ తెలుగు భాహ్సల్లో విజయ్ పులి భారీగా రిలీజ్ కానుంది, అలాగే తెలుగులో వరుణ్ తేజ్ ‘కంచె’, రామ్ ‘శివమ్’ లు కూడా అదే రోజున రిలీజ్ కానున్నాయి. దీంతో థియేటర్స్ కి ఇబ్బంది రావచ్చు అనే ఉద్దేశంతో వెనక్కి వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ఈ రిలీజ్ విషయంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహించిన ఈ సైజ్ జీరో సినిమా ఆడియో సెప్టెంబర్ 6న కౌలాలాంపూర్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అనుష్క, ఆర్య, సోనాల్ చౌహాన్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాని పివిపి బ్యానర్ పై నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు