ప్రభాస్ ప్లాన్ లో చిన్న చేంజ్..?

Published on Apr 14, 2021 7:03 am IST

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు భారీ పాన్ ఇండియన్ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇన్ని రోజులు సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో “సలార్” బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తో “ఆదిపురుష్” సినిమాలు మాత్రమే షూట్ లో ఉన్నాయి అనుకోగా లైన్ లోకి ఇంకా కాస్త బ్యాలన్స్ ఉన్న “రాధే శ్యామ్” కూడా యాడ్ అయ్యింది.

మరి దీని మూలానే ప్రభాస్ ప్లాన్ లో చిన్న చేంజ్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఆదిపురుష్ షూట్ ని ముగించుకున్న ప్రభాస్ నెక్ట్స్ సలార్ కాకుండా దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న రాధే శ్యామ్ లో పాల్గొననున్నాడట.. ఇక ఇదే ప్రభాస్ ఫైనల్ షూట్ అన్నట్టు వినికిడి.. మొత్తానికి మాత్రం ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :