చిన్న సినిమాకు దక్కిన పెద్ద విజయం

చిన్న సినిమాకు దక్కిన పెద్ద విజయం

Published on Dec 12, 2014 4:10 PM IST

ala-ela
సినిమా చిన్నదైనా, పెద్దదైనా అందులో కంటెంట్ వుంటే దాని విజయాన్ని ఎవరూ ఆపలేరని మరోసారి ‘అలా ఎలా?’ విజయం ద్వారా నిరువుపితమైంది. ఈ చిత్ర బృందం చిన్న సినిమా పెద్ద విజయం సాధించిందని పరమానందంలో వున్నారు. ‘లింగ’ వంటి భారీ సినిమా నాడు కూడా ఈ చిత్రం హైదరాబాద్ లో ఆరు స్క్రీన్ లను పెంచడమంటే మామోలు విషయం కాదు

ముగ్గురు స్నేహితుల మధ్య సాగే విభిన్న జీవిత ప్రయాణ నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. చిత్రంలో వున్న ఫ్రెష్ లుక్ కారణంగా మల్టీప్లెక్స్ ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది. రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్, షానిలు నటించిన ఈ సినిమాను అనీష్ కృష్ణ తెరకెక్కించాడు. అశోక్ వర్ధన్ నిర్మాత

తాజా వార్తలు