బుల్లితెరపై కూడా రికార్డ్ స్థాయి రేటింగ్స్ సాధించిన ‘మనం’

బుల్లితెరపై కూడా రికార్డ్ స్థాయి రేటింగ్స్ సాధించిన ‘మనం’

Published on Oct 9, 2014 2:22 PM IST

manam

లెజండ్రీ నటుడు స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి సినిమా ‘మనం’. ఈ సినిమాలో తను ఒక్కరే కాకుండా తన వారసులైన అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైతన్య కూడా కలిసి నటించిన సంగతి మనకు తెలిసిందే. ఇలా మూడు తరాల హీరోలు కలిసి నటించిన ఈ సినిమా ఈ సంవత్సరం మే 23న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఈ సినిమా వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా అందరినీ ఆకట్టుకొని రికార్డ్ స్థాయి టి.ఆర్.పి రేటింగ్స్ సాధించింది. దసరా కానుకగా అక్టోబర్ 4న జెమిని టీవీలో ప్రసారం అయిన ‘మనం’ సినిమాకి తెలుగు ప్రేక్షకుల నుండి అశేష ఆదరణ లభించడమే కాకుండా టి.ఆర్.పి చార్ట్ లో 15.62 రేటింగ్ సాధించింది. అంతే కాకుండా మూవీస్ పరంగా అత్యధిక టెలివిజన్ టి.ఆర్.పి రేటింగ్స్ చార్ట్ లో రెండవ స్థానాన్ని కైవసం చేసుకుంది.

ఇప్పటి వరకూ పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ సినిమా టి.ఆర్.పి రేటింగ్ 19 సాధించి ప్రధమ స్థానంలో ఉంటే, ఇప్పుడు ‘మనం’ సినిమా 15.62 రేటింగ్ సాధించి రెండవ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక మూడవ స్థానంలో బాలకృష్ణ నటించిన ‘లెజెండ్’ సినిమా 11.27 రేటింగ్ తో మూడవ స్థానంలో ఉంది.

తాజా వార్తలు