మాస్ట్రో నుండి “స్నేక్ పీక్” విడుదల..!

Published on Aug 30, 2021 11:22 am IST


నితిన్ హీరోగా, నబ్బా నటేష్ మరియు తమన్నా భాటియా లు లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్న తాజా చిత్రం మాస్ట్రో. మేర్లపాక గాంధీ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం విడుదల కి సిద్దం అయింది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ట్రైలర్ ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం డైరెక్ట్ ఓటిటి గా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కానుంది.

బాలీవుడ్ లో సూపర్ హిట్ సాధించిన అంధ ధూన్ చిత్రానికి ఇది రీమేక్ కావడం తో సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా చిత్ర యూనిట్ స్నేక్ పీక్ ను విడుదల చేయడం జరిగింది. హీరో నితిన్ పియానో వాయిస్తూ ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ చిత్రం లో నితిన్ అంధుడు గా నటిస్తున్నారు. ఒక మర్డర్ కేసు విషయం లో నితిన్ ఎలా డీల్ చేసాడు అనే దాని పై సినిమా కథ ఉంటుంది అని తెలుస్తోంది. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. సుధాకర్ రెడ్డి, నికిత రెడ్డి లు శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సినిమాను నిర్మించడం జరిగింది. ఈ చిత్రం కోసం అభిమానులు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

వీడియో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :