హాస్పిటల్ పాలైన జూనియర్ ఐశ్వర్యరాయ్

హాస్పిటల్ పాలైన జూనియర్ ఐశ్వర్యరాయ్

Published on Jun 3, 2019 6:48 PM IST

స్నేహా ఉల్లాల్ బాలీవుడ్ లో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ “లక్కీ” మూవీతో ఎంట్రీ ఇచ్చారు. బాలీవుడ్ లో లక్ కలిసి రాకపోవడంతో టాలీవుడ్ లో “ఉల్లాసంగా ఉత్సాహంగా, కరెంటు, అలామొదలైంది వంటి విజయవంతమైన చిత్రాలలో మెరిశారు. ఐశ్వర్య రాయ్ కి చాలా దగ్గర పోలికలుండటంతో అందరు జూనియర్ ఐశ్వర్య గా ఇండస్ట్రీలో చలామణి అయ్యింది.

చివరగా 2014 లో అంతా నీ మాయలోనే సినిమాలో కనిపించింది. తర్వాత జాడ లేకుండా పోయింది. అయితే స్నేహ ప్రస్తుతం తన ట్విట్టర్‌లో ఆసుపత్రి బెడ్‌పై ఉన్న ఫోటోలని పోస్ట్ చేసి తాను చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపింది . తీవ్రమైన జ్వరం కారణంగా ఆసుపత్రిలో జాయిన్ కావలసి వచ్చింది. జీవితంలో మొదటిసారి ఆస్పత్రిలో జాయిన్ అయ్యాను. హై ఫీవర్ వలన చికిత్స కోసం హాస్పిటల్‌లో చేరాల్సి వచ్చింది. చాలా భయమేసింది. ఇప్పుడు ఆరోగ్యం కొంత మెరుగైంది. విశ్రాంతి ఎక్కువగా తీసుకోవడం వలన కొద్దిగా త్వరగా కోలుకున్నాను. ప్రస్తుతం మంచిగానే ఇంట్లో ఉన్నాను అని స్నేహ తన ట్వీట్‌లో తెలిపింది

సంబంధిత సమాచారం

తాజా వార్తలు