హృతిక్ రోషన్ ‘క్రిష్ – 4’ లో ఎన్నో ప్రత్యేకతలు ….?

Published on Aug 18, 2022 11:35 pm IST

బాలీవుడ్ స్టార్ యాక్టర్ హృతిక్ రోషన్ ప్రస్తుతం విక్రమ్ వేధా రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మరొక నటుడిగా సైఫ్ ఆలీ ఖాన్ నటిస్తున్నారు. సెప్టెంబర్ చివర్లో ఈ మూవీ విడుదల కానుండగా అనంతరం దీపికా పదుకొనే తో ఫైటర్ మూవీ చేయనున్నారు హృతిక్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఫైటర్ సైనిక వీరత్వాన్ని తెలిపే మూవీగా రూపొందనుంది. అయితే ఈ రెండు సినిమాల తరువాత మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజక్ట్ క్రిష్ – 4 చేయనున్నారు హృతిక్.

దాదాపుగా 18 ఏళ్ళ క్రితం విడుదలైన కోయి మిల్ గయా మూవీ అప్పట్లో పెద్ద విజయం అందుకుంది. అనంతరం దానికి సీక్వెల్ గా వచ్చిన క్రిష్, అలానే ఆపైన మరొక సీక్వెల్ క్రిష్ – 3 కూడా మంచి విజయం అందుకున్నాయి. అయితే దానికి సీక్వెల్ అయిన క్రిష్ – 4 మూవీ కోసం హృతిక్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరూ ఎప్పటి నుండో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఇటీవల ఈ మూవీ కోసం తాను కూడా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు హృతిక్.

కాగా దీని ప్రారంభం, నటీనటులు, సాంకేతికనిపుణులు ఇలా పలు వివరాలు ఇంకా వెల్లడి కావలసి ఉంది. అయితే విషయం ఏమిటంటే, ఈ మూవీకి సంబంధించి అనేక ప్రత్యేకతలు ఉన్నాయని ప్రస్తుతం బాలీవుడ్ లో ట్రెండ్ అవుతున్న బజ్ ప్రకారం తెలుస్తుంది. ఈ మూవీ అంతరీక్ష నేపథ్యంలో సాగె టైం ట్రావెల్ స్టోరీ అని, అలానే క్రిష్ తండ్రి అయిన రోహిత్ మెహ్రాని టైం ట్రావెల్ తో వెనక్కి తీసుకురావడం అనే కథాంశంతో ఆసక్తికరంగా ఈ మూవీ సాగనుందట.

ఇప్పటికే ఈ మూవీ స్టోరీ కోసం రచయిత హానీ ఇరానీ ఈ వర్షన్ ని సిద్ధం చేసారని చెప్తున్నారు. మొత్తంగా సైన్స్ ఫిక్షన్ డ్రామా మూవీగా సాగె సూపర్ హీరో మూవీ అయిన క్రిష్ 4 తప్పకుండా అందరి అంచనాలకు మించి ఉండేలా దర్శకుడు రాకేష్ రోషన్ ఇప్పటినుండే స్క్రిప్ట్ విషయంలో పక్కాగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీకి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాలి అంటే మాత్రం అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :