విక్రమ్ కొడుకు మీద ఒత్తిడి పెరిగిపోతోంది

Published on Jun 23, 2019 10:00 pm IST

విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ ‘అర్జున్ రెడ్డి’ తమిళ్ రీమేక్ ‘ఆదిత్య వర్మ’తో హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అనేక ఒడిదుడుకుల తర్వాత ఈ రీమేక్ షూటింగ్ ముగిసింది. మొదట్లో బాల డైరెక్ట్ చేసిన సినిమా మొత్తాన్ని పక్కనబెట్టి గిరీశాయ డైరెక్షన్లో కొత్తగా చిత్రాన్ని మళ్ళీ షూట్ చేశారు. ఏ డెబ్యూ హీరోకైనా ఇది పెద్ద తలనొప్పి తెప్పించే పరిణామమే. మొదటి సినిమాకే ఆ ఒత్తిడిని భరించాడు ధృవ్.

దానికి తోడు ఇప్పుడు ఆయన మీద ఒత్తిడి రెట్టింపైంది. అందుకు కారణం హిందీ వెర్షన్ ‘కబీర్ సింగ్’ మంచి హిట్ కావడం. అటు తెలుగు, ఇటు హిందీ.. రెంటికీ దర్శకుడు సందీప్. రెండు వెర్షన్లు హిట్టయ్యాయి. దీంతో తమిళ వెర్షన్ ఏమవుతుంది, ఆ రెండు వర్షన్లలో వర్కవుట్ అయిన మ్యాజిక్ తమిళంలో వర్కవుట్ అవుతుందా, విజయ్ దేవరకొండ, షాహిద్ కపూర్ స్థాయిలో ధృవ్ నటిస్తాడా అనే ప్రశ్నలు జనాల్లో మొదలై అంచనాలు పెరిగాయి. ఫలితంగా ధృవ్ నటన తప్పనిసరిగా వారిని మ్యాచ్ చేయకపోయినా కనీసం దగ్గర్లోనైనా ఉండాలని తమిళ ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇదే ఇప్పుడు ఆ యువ హీరో మీద ఒత్తిడిని తెస్తోంది.

సంబంధిత సమాచారం :

X
More