
అల్లు అర్జున్, త్రివిక్రమ్‌ల సూపర్‌హిట్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘S/O సత్యమూర్తి’. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 9వ తేదీన విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు మంచి కలెక్షన్లను తెచ్చిపెట్టారు. మొదట ఈ సినిమాకు మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చినా, ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను బాగా ఆదరించారు. ఈ సినిమా విడుదలై నేటికి యాభై రోజులు. సుమారు 55 సెంటర్లలో ఈ సినిమా యాభై రోజులు పూర్తి చేసుకుంది. దాదాపుగా 51కోట్ల రూపాయల షేర్‌ను వసూలు చేసిన ఈ సినిమా ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో కలెక్షన్ల పరంగా టాప్‌లో నిలిచింది.
హారిక ఆన్డ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించారు. ఓ సినిమా రెండు మూడు వారాలకు మించి థియేటర్లలో నిలిచే పరిస్థితి లేని ఈ రోజుల్లో S/O సత్యమూర్తి యాభై రోజులు పూర్తి చేసుకోవడం విశేషమే! అల్లు అర్జున్ యాక్టింగ్, త్రివిక్రమ్ స్టైల్ మేకింగ్ ‘S/O సత్యమూర్తి’ సినిమాకు బాగా కలిసివచ్చాయని చెప్పాలి. త్రివిక్రమ్ డైలాగులు రిపీటెడ్ ఆడియన్స్‌ను తెచ్చిపెట్టాయి. ఇక ఈ సినిమాకు సమంత, నిత్యామీనన్, అదాశర్మలు స్పెషల్ ఆకర్షణగా నిలవగా, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం కూడా సినిమా విజయంలో మంచి పాత్ర పోషించింది.

