నిత్యా, సమంతలతో స్టెప్పులేస్తున్న అల్లు అర్జున్.

నిత్యా, సమంతలతో స్టెప్పులేస్తున్న అల్లు అర్జున్.

Published on Feb 22, 2015 3:16 AM IST

allu-arjun2
అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో తెరకెక్కుతున్న ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. హైదరాబాద్ శివార్లలో ప్రత్యేకంగా వేసిన ఇంటి సెట్ లో బన్ని, నిత్యా మీనన్, సమంతలపై పాటను చిత్రీకరిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం వరకు ఇదే ఇంట్లో టాకీ పార్ట్ షూటింగ్ జరిపారు.

ఈ పాట చిత్రీకరణ పూర్తయిన తర్వాత మరొక యూనిట్ స్పెయిన్ వెళ్లనుంది. అక్కడ మరికొన్ని పాటలను చిత్రీకరించనున్నారు. సాంగ్స్ షూటింగ్ మాత్రమే బాలన్స్ ఉందని, టాకీ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయ్యిందని సమాచారం.

సమంత, నిత్యా మీనన్, అదా శర్మలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, స్నేహ, ఉపేంద్ర, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఎస్.రాధాకృష్ణ నిర్మాత. ఏప్రిల్ నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు