వాయిదా పడ్డ ‘S/O సత్యమూర్తి’ థాంక్స్ మీట్

వాయిదా పడ్డ ‘S/O సత్యమూర్తి’ థాంక్స్ మీట్

Published on Apr 16, 2015 2:38 PM IST

Son-Of-SatyaMurty
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘S/O సత్యమూర్తి’. మొదటి సాటి అల్లు అర్జున్ సమంత, నిత్యా మీనన్, ఆద శర్మ లతో అనగా ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేసిన ఈ సినిమా గత గురువారం రిలీజ్ అయ్యి సూపర్బ్ కలెక్షన్స్ రాబట్టుకుంది. మొదటి వారంలోనే ప్రపంచ వ్యాప్తంగా సుమారు 35 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది. ఈ సినిమాని ఇంత పెద్ద విజయం చేసినందుకు తెలుగు ప్రేక్షకులకు థాంక్స్ చెప్పుకోవడానికి ఈ చిత్ర టీం గ్రాండ్ గా థాంక్స్ మీట్ ని చేయాలనుకున్నారు.

అది కూడా ఈ నెల 18న హైదరాబాద్ లోని శిల్పకళ వేదికలో జరపాలనుకున్నారు. కానీ ప్రస్తుతం వేదిక పరంగా చిన్న సమస్య రావడతో ఈ థాంక్స్ మీట్ ని వాయిదా వేసారు. త్వరలోనే సరికొత్త థాంక్స్ మీట్ డేట్ మరియు వేదికని తెలియజేయనున్నారు. ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినా ఈ రేంజ్ కలెక్షన్స్ రావడానికి ప్రధాన కారణం బన్ని – త్రివిక్రమ్ కాంబినేషన్ పై ఉన్న అంచనాలు, సమ్మర్ సీజన్ లో మరే సినిమా లేకపోవడం అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉపేంద్ర, రాజేంద్ర ప్రసాద్, స్నేహ ముఖ్య పాత్రలు పోషించారు. ఎస్. రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ఈ వేడుకకి మెగా ఫ్యామిలీ నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.

తాజా వార్తలు