“పుష్ప 2” పుకార్లు నిజమేనా!?

“పుష్ప 2” పుకార్లు నిజమేనా!?

Published on Jun 15, 2024 7:02 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ సినిమా “పుష్ప 2” కోసం పాన్ ఇండియా ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ పుష్ప 1 నేషనల్ వైడ్ గా అదరగొట్టగా ఇప్పుడు పుష్ప 2 కూడా ఆల్రెడీ సాంగ్స్ తో షేక్ చేస్తుంది. అయితే జస్ట్ కొన్ని రోజులు నుంచే పుష్ప 2 వాయిదా పడింది అంటూ కొన్ని రూమర్స్ బయటకి వచ్చాయి.

ఇక దీనిపై అధికారిక క్లారిటీ రాలేదు కానీ అనధికారికంగా మాత్రం దాదాపు కన్ఫర్మ్ అనుకోవచ్చు. ఎందుకంటే తాజాగా అసలు లిస్ట్ లో లేని “డబుల్ ఇస్మార్ట్” ఈ డేట్ ని లాక్ చేసుకుంది. సో పుష్ప 2 లేదు కనుకే వారు ఈ డేట్ కి వస్తున్నారని చెప్పొచ్చు. అలాగే ఈ డేట్ లోనే నాని సరిపోదా శనివారం కూడా ప్రీ పోన్ అవుతుంది అనే రూమర్స్ కూడా ఉన్నాయి. సో పుష్ప 2 విషయంలో మాత్రం ఇప్పుడు కొంచెం ఆ రూమర్స్ నిజమే అనుకోవాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు