రాధే శ్యామ్ నుండి సొచ్ లియా టీజర్ రేపు విడుదల!

Published on Dec 5, 2021 9:05 pm IST


యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న సరికొత్త చిత్రం రాధే శ్యామ్. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ను ప్రపంచ వ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 14 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. సంక్రాంతి పండుగ బరిలో దిగుతుండటం తో అభిమానులు, ప్రేక్షకులు ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ ఫిల్మ్స్ మరియు యూ వీ క్రియేషన్స్ వారు సంయుక్తం గా నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు విడుదల అయ్యి ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీ గా విడుదల కానున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో సైతం ఇందుకు సంబంధించిన ప్రమోషన్స్ ను చేస్తున్నారు మేకర్స్. ఆషికి ఆ గయి అంటూ విడుదల అయిన పాట విశేషం గా ఆకట్టుకుంటుంది. అదే విధంగా రేపు ఈ చిత్రం నుండి సోచ్ లియా అనే పాటకు సంబందించిన టీజర్ ను మధ్యాహ్న 1 గంటకు విడుదల చేయనున్నారు. ఇందుకోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ పాటకి మిథున్ సంగీతం అందిస్తున్నారు. మనోజ్ ముంతశిర్ ఈ పాటకి లిరిక్స్ రాయగా, అరిజిత్ సింగ్ పాడటం జరిగింది.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రం కోసం కేవలం టాలీవుడ్ అభిమానులు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు, అభిమానులు ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :