‘సోగ్గాడే చిన్ని నాయనా’ ఆడియో రిలీజ్ డేట్

Soggade-Chinni-Nayana
‘మనం’ సినిమా తర్వాత దాదాపు ఏడాది పైన గ్యాప్ తీసుకున్న కింగ్ నాగార్జున మరోసారి ద్విపాత్రాభినయంలో నటించిన సినిమా ‘సోగ్గాడే చిన్ని నాయనా’. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ‘ఆత్మ’ల కాన్సెప్ట్ నేపధ్యంలో ఆధ్యంతం ప్రేక్షకులను నవ్వించేలా సోగ్గాడే చిన్ని నాయనాని తీర్చిదిద్దినట్లు సమాచారం. ఈ చిత్ర టీం సంక్రాంతి బరిలో జనవరి 15వ తేదీన సోగ్గాడే చిన్ని నాయనాని రిలీజ్ చేసే ప్లాన్స్ లో ఉన్నారు.

తాజాగా ఈ చిత్ర టీం ఆడియో రిలీజ్ కి సన్నాహాలు చేసుకుంటున్నారు. మాకు అందిన సమాచారం ప్రకారం అనూప్ రూబెన్స్ అందించిన మ్యూజిక్ ని డిసెంబర్ 27న హైదరాబాద్ లో గ్రాండ్ గ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సంక్రాంతి సీజన్లో సినిమాలు ఎక్కువ ఉంటాయి అలాగే థియేటర్స్ కి ఎక్కవ పోటీ ఉంటుందని ఇప్పటికే చాలా ఏరియాలలో డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమా కోసం థియేటర్స్ ని ఫిక్స్ చేసారట. నాగార్జున సరసన లావణ్య త్రిపాఠి, రమ్యకృష్ణ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి కళ్యాణ్ కృష్ణ డైరెక్టర్. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకి నిర్మాత రాధా మోహన్ కథ, స్క్రీన్‌ప్లే అందించడం విశేషం.

Exit mobile version