“హరిహర వీరమల్లు” రిలీజ్ పై సాలిడ్ క్లారిటీ.!

“హరిహర వీరమల్లు” రిలీజ్ పై సాలిడ్ క్లారిటీ.!

Published on Dec 24, 2022 2:00 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న అలాగే చేయనున్న చిత్రాల్లో విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తో చేస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “హరిహర వీరమల్లు” కూడా ఒకటి. దీనిపై భారీ అంచనాలు కూడా నెలకొనగా ఈ సినిమా షూట్ ఇప్పుడు శరవేగంగా కంప్లీట్ అవుతుంది. ఇక ఈరోజు బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ కూడా జాయిన్ కాగా సినిమా మంచి హాట్ టాపిక్ గా మారింది.

ఇక ఈ చిత్రం రిలీజ్ విషయంలో ఇది వరకే మేకర్స్ క్లారిటీ ఇచ్చేసారు. వచ్చే ఏడాది సినిమా సమ్మర్ లో రిలీజ్ అవుతుంది అని అప్పుడు పవర్ గ్లాన్స్ ఇచ్చినపుడే చెప్పేసారు. కానీ మధ్యలో కొన్ని డిలే లు ఉండడం మూలాన సినిమా వేసవి నుంచి లేట్ అవ్వొచ్చు అనే బజ్ వచ్చింది. కానీ ఇప్పుడు ఈరోజు వీడియోలో కూడా మళ్ళీ సినిమా వేసవి కానుక గానే రిలీజ్ చేస్తున్నట్టుగా సాలిడ్ క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ డేట్ ఎప్పుడు అనేది ఇంకా అనౌన్స్ కావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు