“సర్కారు వారి పాట” సూపర్ ఫిల్మ్..కాన్ఫిడెన్స్ లెవెల్స్.!

Published on Nov 24, 2021 8:00 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తీ సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. మహేష్ కెరీర్ లోనే మంచి మోస్ట్ అవైటెడ్ గా వస్తున్న ఈ చిత్రాన్ని నెక్స్ట్ లెవెల్లో చిత్ర యూనిట్ ప్రెజెంట్ చేస్తున్నారు.

మరి ఇదిలా ఉండగా ఈ సినిమాపై సంగీత దర్శకుడు థమన్ చేసిన కామెంట్స్ మరింత కాన్ఫిడెన్స్ ని పెంచుతున్నాయి. సినిమా సాంగ్స్ అప్డేట్స్ కోసం మాట్లాడుతూ ఇది సూపర్ ఫిల్మ్ అని ఎక్కడా డౌట్ లేకుండా చెప్తున్నాడు అంతే కాకుండా సాంగ్స్ ఈపాటికే రావాల్సింది.

కానీ ఏప్రిల్ రిలీజ్ అవ్వడం వల్ల సాంగ్స్ ని జనవరి నుంచి రిలీజ్ చేస్తున్నట్టుగా కూడా థమన్ క్లారిటీ ఇచ్చాడు. థమన్ కి ఈ లెవెల్ కాన్ఫిడెన్స్ ఉంది అంటే సినిమా అదిరిపోయిందనే లెక్క. ఇక సిల్వర్ స్క్రీన్ పై మహేష్ డబుల్ హ్యాట్రిక్ కి దీనితోనే నాంది పలికినట్టే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :

More