నైజాంలో సాలిడ్ డీల్ దక్కించుకున్న “ఉప్పెన”

Published on Mar 3, 2020 11:16 pm IST

మెగా కాంపౌండ్ నుంచి తెలుగు తెరకు పరిచయం అయ్యేందుకు సన్నద్ధం అవుతున్న మరో హీరో సాయి ధరమ్ తేజ్ వైష్ణవ్ తేజ్.ఇప్పుడు వైష్ణవ్ మరియు మరో నూతన నటి కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం “ఉప్పెన”. టాలీవుడ్ విలక్షణ దర్శకుడు సుకుమార్ దగ్గర పని చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ బుచ్చి బాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి బజ్ ఉంది.అలాగే నిన్ననే ఈ సినిమా తాలూకా ఫస్ట్ సింగిల్ కూడా బయటకు వచ్చి మంచి స్పందనను అందుకుంది.

ఇదిలా ఈ చిత్రానికి నైజాంలో అద్భుతమైన డీల్ కుదిరినట్టు తెలుస్తుంది.ప్రముఖ దర్శకుడు “దిల్” రాజు ఈ నైజాం హక్కులను 4 కోట్లకు సొంతం చేసుకున్నట్టు సమాచారం.ఒక డెబ్యూ హీరో మరియు దర్శకులకు ఇది ఖచ్చితంగా మంచి ధరే అని చెప్పాలి.కోలీవుడ్ ప్రముఖ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఏ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More