రకుల్, అక్షయ్ ల థ్రిల్లర్ సినిమాకి భారీ ఓటిటి ఆఫర్.!

Published on Mar 31, 2022 12:00 pm IST

ఇప్పుడు థియేటర్స్ తెరుచుకున్నాయి కూడా పలు సినిమాలు మాత్రం ఇంకా ఓటిటి రిలీజ్ మాత్రం ఆగడం లేదు. సినిమాపై హైప్ కారణంగా ఏమో కానీ చాలా వరకు స్టార్ హీరోలు హీరోయిన్స్ సినిమాలు ఓటిటి లోనే విడుదల అయ్యిపోతున్నాయి. అలా లేటెస్ట్ గా రిలీజ్ కి వస్తున్న మరో భారీ సినిమా “మిషన్ సిండ్రెల్లా”.

బాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మరియు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఇప్పుడు డైరెక్ట్ ఓటిటి రిలీజ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. దర్శకుడు రంజిత్ తివారి తెరకెక్కించిన ఈ సినిమా కోలీవుడ్ హిట్ సినిమా “రాట్సాసన్” కి రీమేక్ గా తెరకెక్కింది.

మరి ఈ సినిమాని డిస్నీ+ హాట్ స్టార్ వారు భారీ మొత్తంలో 135 కోట్ల రూపాయలని చెల్లించి సొంతం చేసుకున్నారట. అలాగే ఈ చిత్రం ఏప్రిల్ చివరిలో రిలీజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. తెలుగులో “రాక్షసుడు”గా రీమేక్ అయ్యి హిట్ అయ్యిన ఈ సినిమా మరి హిందీలో ఈ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :