చిరు – మెహర్ ల ప్రాజెక్ట్ కు గట్టిగానే ప్లాన్ చేస్తున్నారా?

Published on Sep 26, 2020 10:15 pm IST

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో “ఆచార్య” చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ పునః ప్రారంభం అయ్యేందుకు రెడీ అవుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్ర పోషించనుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత చిరు రెండు రీమేక్ సినిమాలు లైన్ లో ఉంచారు. వాటిలో తమిళ్ హిట్ చిత్రం వేదాళం రీమేక్ కూడా ఒకటి.

ఈ చిత్రానికి మెహర్ రమేష్ కూడా ఓకె అయ్యిన సంగతి తెలిసిందే. అయితే ఇపుడు లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ చిత్రంలో యాక్షన్ సీక్వెన్స్ లను గట్టిగా ప్లాన్ చేయనున్నారట. ముఖ్యంగా అవి ఈ చిత్రానికి ప్రధాన హైలైట్ అయ్యే విధంగా డిజైన్ చెయ్యాలని భావనలో ఉన్నారట. అందుకే మంచి ఫైట్ మాస్టర్స్ పేర్లను పరిశీలనలో ఉంచినట్టు తెలుస్తుంది. ఈ చిత్రం ఆచార్య పూర్తయ్యాక మొదలు కానుంది. మరి ఈ భారీ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More