యూఎస్‌లో సెకెండ్ వీకెండ్ కూడా ‘శ్రీమంతుడు’ హవా!

యూఎస్‌లో సెకెండ్ వీకెండ్ కూడా ‘శ్రీమంతుడు’ హవా!

Published on Aug 17, 2015 8:28 PM IST

srimnathudu
సూపర్ స్టార్ మహేష్ హీరోగా, ‘మిర్చి’ ఫేం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘శ్రీమంతుడు’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోన్న విషయం తెలిసిందే. ఆగష్టు 7న ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలైన ఈ సినిమా, మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకెళుతోంది. మొదటి వారం అన్ని చోట్లా కలెక్షన్లను కుమ్మేసిన ఈ సినిమా అదే ఊపుతో రెండో వారంలోకి అడుగుపెట్టింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడులో కూడా శ్రీమంతుడు రెండో వారాంతం స్టడీగా నిలబడింది.

ఇక మహేష్‌కు ఫుల్ క్రేజ్ ఉన్న అమెరికాలో ఆ క్రేజ్ స్థాయి ఏంటనేది శ్రీమంతుడు చూపెడుతోంది. సెకెండ్ వీకెండ్ సుమారు 343కే డాలర్లు వసూలు చేసిన ఈ సినిమా, ఇప్పటివరకూ మొత్తం 2.65 మిలియన్ డాలర్లు కొల్లగొట్టింది. ఇండియన్ రూపాయల్లో లెక్కేస్తే ఈ మొత్తం సుమారు 17.35 కోట్లు. ఇక ఇదే జోరు కొనసాగితే ఈ సినిమా 3 మిలియన్ డాలర్లు కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అమెరికాలో బాహుబలి తర్వాతి స్థానాన్ని సొంతం చేసుకొని శ్రీమంతుడు రెండో స్థానంలో నిలిచింది. మహేష్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది.

తాజా వార్తలు