సోలో రిలీజ్ మిస్టర్ మజ్ను కి కలిసి రానుంది !

Published on Dec 21, 2018 2:13 am IST

అక్కినేని యువ హీరో అఖిల్ నటిస్తున్న మూడవ చిత్రం ‘మిస్టర్ మజ్ను’ చిత్ర షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇక ఈచిత్రం వచ్చే ఏడాది జనవరి 25కు విడుదలకానుందని మేకర్స్ ఇటీవల అధికారికంగా ప్రకటించారు. ఈ డేట్ అఖిల్ కు కలిసి వచ్చేలా వుంది. ఎందుకంటే జనవరి 24న ఎన్టీఆర్ మహానాయకుడు విడుదలకావాల్సి ఉండగా వాయిదాపడి ఫిబ్రవరి 7న విడుదలవుతుంది. దాంతో మిస్టర్ మజ్ను కి పోటీగా మరో చిత్రం విడుదలకావడం లేదు. కంగనా నటిస్తున్న ‘మణికర్ణిక’ తెలుగులో అదే రోజు విడుదలవుతున్నా ఆ ఎఫెక్ట్ ఈచిత్రం ఫై వుండదు. ఒకవేళ అదే రోజు వేరే చిత్రాలు విడుదలైన అవ్వని చిన్న సినిమాలే అయ్యే ఛాన్స్ వుంది. సో అఖిల్ సరైన సమయానికే తన సినిమాను థియేటర్లకు తీసుకువస్తున్నాడన్న మాట. మరి బ్లాక్ బ్లాస్టర్ విజయం కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్న అఖిల్ ఈచిత్రంతో ఆలోటును తీర్చుకుంటాడో లేదో చూడాలి.

‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :