పూరి, పవన్ కాంబోలో ఆ సినిమాపై క్లారిటీ ఇదే.!

Published on Jun 5, 2021 7:05 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు పలు భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే.మరి అలాగే ఇటీవల కరోనా నుంచి కోలుకున్న పవన్ త్వరలోనే తన పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ “హరిహర వీరమల్లు” అలాగే మాస్ ప్రాజెక్ట్ “అయ్యప్పణం కోషియం” రీమేక్ చిత్రాల్లో ఏకకాలంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు.

అయితే ఇదే నేపథ్యంలో పవన్ నుంచి మరో సెన్సేషనల్ సినిమా రాబోతుంది అని టాక్ వైరల్ అయ్యింది. అదే మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబోలో.. వీరి నుంచి వచ్చిన బద్రి, కెమెరా మెన్ గంగతో రాంబాబు కల్పించిన ఇంపాక్ట్ ఇప్పటికీ అందుకే అందుకే జస్ట్ టాక్ వచ్చినా అది వేరే లెవెల్ కి వెళ్ళింది.

అయితే ఈ కాంబోలో పూరి డ్రీం ప్రాజెక్ట్ అయినటువంటి “జనగణమన” ఉంటుందని గాసిప్స్ కూడా ఊపందుకున్నాయి. కానీ లేటెస్ట్ ఇన్ఫో ప్రకారం ఈ కాంబో నుంచి ఆ సినిమా అసలు లేదని తెలిసింది. కానీ ఈ కాంబోలో సినిమా అయితే లేదు అన్నట్టు తెలియరాలేదు. మరి ఒకవేళ సినిమా ఉంటే ఎలాంటి ప్రాజెక్ట్ తో వస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :