రజినీ మీద మండిపడ్డ అభిమానులు

Published on Jun 28, 2021 5:03 pm IST

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. కొన్నిరోజుల క్రితమే హెల్త్ చెకప్ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం వద్ద నుండి స్పెషల్ అనుమతులు తీసుకుని మరీ వెళ్లారు. అయితే అమెరికా వెళ్లినప్పటి నుండి రజనీ నుండి ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. దీంతో ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. అయితే రచయిత వైరముత్తు మాత్రం రజినీ హెల్త్ గురించి ఖచ్చితమైన అప్డేట్ ఇవ్వడం జరిగింది. రజినీ తనకు యూఎస్ నుండి ఫోన్ చేసి మాట్లాడారని, హెల్త్ చెకప్ చాలా బాగా జరిగిందని చెప్పారని అన్నారు.

రజినీ మాటల్లో ఆరోగ్యం, సంతోషం ధ్వనిస్తున్నాయని అన్నారు. వైరముత్తు ఇచ్చిన అప్డేట్ పట్ల సూపర్ స్టార్ అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రజినీ ఆరోగ్యం క్షేమం అని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. మంచి సమాచారం ఇచ్చినందుకు వైరముత్తును అభినందించినవారు కూడ ఉన్నారు. అయితే మరోవైపు రజినీ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారువారు కూడ ఉన్నారు. గతంలో చిన్మయి, ఇంకొందరు వైరముత్తు మీద మీటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అలాంటి ఆరోపణలున్న వ్యక్తితో రజినీ స్నేహం ఎందుకు చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. ఇకనైనా రజినీ వైరముత్తుతో స్నేహం వీడాలని ఆంటున్నారు.

సంబంధిత సమాచారం :