మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా రొమాన్స్ చేయడానికి రెడీ అయ్యిందని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. శ్రీను వైట్ల దర్శకత్వంలో చరణ్ నటించబోయే సినిమాలో హీరోయిన్ గా నటించమని ‘దబాంగ్’ బ్యూటీని సంప్రదించారట. జనవరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ఈ శుక్రవారం విడుదలవుతున్న ‘లింగ’ సినిమాతో సౌత్ సినిమా ఇండస్ట్రీలో సోనాక్షి సిన్హా అడుగుపెడుతుంది. మంచి ఆఫర్స్ వస్తే తెలుగులో నటించడానికి సిద్దమంటూ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. రజినీకాంత్ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సోనాక్షికి.. తెలుగులో రామ్ చరణ్ సినిమా అవకాశం వస్తే ఇక వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం ఉండదు.


