పండగ చేస్కోతో మెప్పించిన సోనాల్ చౌహాన్

పండగ చేస్కోతో మెప్పించిన సోనాల్ చౌహాన్

Published on May 29, 2015 11:00 PM IST

Sonal-Chowhan
బాలకృష్ణ లెజెండ్ లో మెరిసిన సోనాల్ చౌహాన్ తాజాగా ‘పండగచేస్కో’ సినిమాతో మరోసారి ప్రేక్షకులకు కనులవిందు చేసింది. ఈ సినిమా విడుదలైన అన్ని సెంటర్ లలో మంచి రెస్పాన్స్ ని అందుకోవడమేకాక సినిమాలో గ్లామర్ పాత్ర పోషించిన సోనాల్ చౌహాన్ పై ప్రత్యేకంగా ప్రశంసలు వినిపిస్తున్నాయి.

బాగా డబ్బున్న బిజినెస్ లేడీగా అటు అందచందాలతో ఇటు నటనతో సోనాల్ అందరినీ ఆకట్టుకుంది. ఈ జీరో సైజు సుందరి ప్రస్తుతం అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘సైజ్ జీరో’ చిత్రంలో రెండవ హీరోయిన్ గా కనిపించనుంది.

తాజా వార్తలు