ఇద్దరమ్మాయిలతో రామ్ ‘పండగ చేస్కో’..!

ఇద్దరమ్మాయిలతో రామ్ ‘పండగ చేస్కో’..!

Published on Jul 12, 2014 10:00 PM IST

Pandaga-chesko
యంగ్ & ఎనర్జిటిక్ హీరో రామ్ తన కొత్త సినిమా ‘పండగ చేస్కో’లో ఇద్దరమ్మాయిలతో రొమాన్స్ చేయడానికి రెడీ అయ్యాడు. ‘బలుపు’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో ఇద్దరు హీరోయిన్లను సెలెక్ట్ చేసేశారు.

‘లెజెండ్’ సినిమాతో హిట్ అందుకున్న హీరోయిన్ సోనాల్ చౌహాన్ ను ‘పండగ చేస్కో’లో ఒక హీరోయిన్’గా ఛాన్స్ సొంతం చేసుకుంది. రాకుల్ ప్రీత్ సింగ్ మరొక హీరోయిన్. ఈ సినిమాలో రామ్ క్యారెక్టర్ చాలా స్టైలిష్ గా ఉంటుందని సమాచారం. అమెరికా నుండి ఇండియా వచ్చిన ఎన్నారై యువకుడి పాత్రలో రామ్ నటిస్తున్నారు. వెలిగొండ శ్రీనివాస్ ఈ సినిమాకు కథ అందిస్తున్నారు.

తాజా వార్తలు