యువనటుడు రామ్ నటిస్తున్న ‘పండగ చేస్కో’ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహాన్ లు ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్న విషయం తెలిసినదే. సోనాల్ రకుల్ ని ప్రశంసలలో ముంచెత్తింది. “రకుల్ కి స్నేహపూరిత మనస్తత్వం ఎక్కువ. నేను ఆమె సినిమాలు చూడలేదు గాని ఆమె మంచి నటి అన్న విషయం మాత్రం సెట్స్ లో తనని చూస్తే తెలుస్తుంది” అని తెలిపింది
ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకుడు. సాయి కుమార్, జగపతిబాబు ముఖ్యపాత్రధారులు. తమన్ సంగీతదర్శకుడు. పరుచూరి కిరీటి నిర్మాత


