సాంగ్ కోసం రెడీ అయిన సోనాల్ చౌహాన్ !

Published on Aug 18, 2019 6:20 pm IST

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్ అండ్ వేదిక నటించనున్నారు. కాగా తాజాగా ఈ సినిమా బ్యాంకాక్ షెడ్యూల్ లో సోనాల్ చౌహాన్ కూడా పాల్గొందట. బాలయ్య – సోనాల్ పై ఓ సాంగ్ షూట్ చేయనున్నారు. ఇక ఈ సాంగ్ కోసం సోనాల్ బికినీ వేస్తోందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో బాలయ్య రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. అయితే సోనాల్ చౌహన్ మధ్య వయస్సులో ఉండే బాలయ్య పాత్రకు జోడీగా కనిపించనుంది.

గతంలో ఈమె బాలకృష్ణతో కలిసి ‘లెజెండ్, డిక్టేటర్’ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ‘డిక్టేటర్’ తర్వాత ఆమె చేస్తున్న తెలుగు చిత్రం కూడా ఇదే కావడం విశేషం. అలాగే ఓ కీలకమైన పాత్రలో నమితను కనిపించనుంది. నమితది నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర.. ముఖ్యంగా సినిమాలో బాలయ్యకి విలన్ గా కనిపించనుంది. ఇప్పటికే సింహా సినిమాలో బాలయ్య సరసన నమిత నటించింది. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘రూలర్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

సంబంధిత సమాచారం :