ఎమోషనల్ గా ట్వీట్ చేసిన ఒకప్పటి స్టార్ హీరోయిన్ !

Published on Aug 12, 2018 5:16 pm IST

ఒకప్పటి స్టార్ హీరోయిన్ సోనాలి బింద్రే ప్రస్తుతం కాన్సర్ మహమ్మారితో బాధపడుతున్నారు. కాగా ఆమె న్యూయార్క్‌లో కాన్సర్ కు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఐతే ఈ రోజు సోనాలి బింద్రే కుమారుడు 13వ పుట్టినరోజును జరుపుకుంటుండగా తన కుమారుడ్ని కలవలేని ఆమె ఎమోషనల్ గా ట్వీట్ చేశారు.

సోనాలి బింద్రే ట్విట్ లో ‘రణ్‌వీర్‌.. నా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశం.. నేను కొంచెం ఎక్కువ ఎమోషనల్ అవుతున్నానేమో. కానీ వావ్‌, నువ్వు ఇప్పుడు టీనేజర్‌వి.. ఈ వాస్తవాన్ని నమ్మడానికి నాకు కొంచెం టైం పడుతుంది. నీ మంచితనం స్ట్రెంత్ పట్ల నేను చాలా గర్వంగా ఉన్నాను. నా బుజ్జి కుమారుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. నిన్ను చాలా మిస్‌ అవుతున్నాను. ఏమైనా నీకు నా సంపూర్ణమైన ప్రేమ ఎప్పుడు ఉంటుంది’ అని సోనాలి బింద్రే పోస్ట్‌ చేసారు.

సంబంధిత సమాచారం :

X
More