నాగార్జున, నానిల సినిమా పనులు మొదలయ్యాయి !
Published on Feb 24, 2018 4:40 pm IST

సీనియర్ హీరో అక్కినేని నాగార్జున, యంగ్ హీరో నానిలుఒక మల్టీ స్టారర్ కోసం చేతులు కలిపిన సంగతి తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ఈరోజే లాంచ్ అయింది. ఈరోజు నుండే చిత్ర సంగీత దర్శకుడు మణిశర్మ మ్యూజిక్ పాటలు రికార్డింగ్ మొదలుపెట్టారు. మార్చి నుండి సినిమా సెట్స్ మీదికి వెళ్లనుంది.

ఫుల్ లెంగ్త్ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ తన వైజయంతి మూవీ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. తొలిసారి నాని, నాగార్జునలు కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో దీనిపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోల కోసం హీరోయిన్ల వెతుకులాట జరుగుతుండగా త్వరలోనే పూర్తి వివరాల్ని వెల్లడించనున్నారు దర్శక నిర్మాతలు.

 
Like us on Facebook