ఆగడు బృందంలో సోనూ సూద్

Published on Apr 4, 2014 4:21 am IST

Sonu-Sood
దూకుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర చేసిన హంగామాని మరోసారి గుర్తుచేయడానికి శ్రీను వైట్ల కంకణం కట్టుకున్నాడు. ప్రస్తుతం తాను తీస్తున్న ఆగడు సినిమాలో మహేష్, తమన్నాల మధ్య హైదరాబాద్ లో కొన్ని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పుడు దూకుడులో మెయిన్ విలన్ పాత్ర పోషించిన సోనూ సూద్ ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు

దూకుడు విడుదలై దాదాపు రెండున్నర సంవత్సరాలు కావస్తుంది. ఈ సమయంలో నటుడిగా సోనూ సూద్ చాలా పరిణితి సాధించాడని, అతనితో పనిచేయడం ఆనందకరమని దర్శకుడు తెలిపాడు. ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రధారి. రాజేంద్ర ప్రసాద్ మహేష్ బాబు కి తండ్రి పాత్ర పోషించారు

థమన్ సంగీతదర్శకుడు. 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది విడుదలకానుంది

సంబంధిత సమాచారం :