70 లక్షల మంది కుటుంబంతో సోనూ సూద్.!

Published on May 16, 2021 1:43 pm IST

ఇప్పుడు మన ఇండియాలో రియల్ హీరో అంటే ఎవరు అన్న ప్రశ్న వస్తే ముక్త కంఠంతో వినిపించే పేరు సోనూ సూద్. గత ఏడాది కరోనా టైం నుంచి నిర్విరామంగా తన సేవలను ఈ దేశానికి అందిస్తూనే ఉన్నాడు. సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో ఉండే సోనూ సూద్ ఈ ఇపుడు దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ అందించేందుకు కూడా పూనుకున్నాడు.

అలాగే రీసెంట్ గానే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ని కూడా పెట్టి సహాయం కావాల్సిన వారికి మరో సులువైన మార్గం చూపించాడు. మరి ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు తన సొంత ఖర్చులతో చేస్తున్న సోనూసూద్ ట్విట్టర్ కుటుంబం 70 లక్షల మందికి చేరింది. తాజాగా 7 మిలియన్ ఫాలోవర్స్ తో సోనూ సూద్ కొత్త మైల్ స్టోన్ ని టచ్ చేసాడు. ఇప్పుడు సోనూసూద్ “ఆచార్య”, “హరిహర వీరమల్లు” సహా పలు కీలక చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :