ప్రముఖ నటుడు సోను సూద్ దేశవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులకి ఎంతో సుపరిచితం. హిందీ , తెలుగు, తమిళ్ సహా పలు ఇతర భాషల్లో కూడా నటించి తన ఆకట్టుకునే నటనతో ఆడియన్స్ నుండి మంచి పేరు సొంతం చేసుకున్నారు. అంతేకాదు ఇటీవల కరోనా సమయంలో ఎందరో ప్రజలకు తనవంతుగా సహాయం అందించి గొప్ప మనసు చాటుకున్నారు సోను సూద్.
అయితే విషయం ఏమిటంటే, తాజగా ఆస్క్ సోను సూద్ పేరుతో నేడు తన ట్విట్టర్ లో ఫ్యాన్స్ తో కొద్దిసేపు చాట్ సెషన్ నిర్వహించారు సోను సూద్. అందులో భాగంగా ఇళయదళపతి విజయ్, సూపర్ స్టార్ మహేష్ బాబు ల గురించి ఒక్క మాటలో చెప్పండి అని ఒక ఫ్యాన్ ఆయనని అడుగగా ఆ ఇద్దరితో నేను నటించాను ఇద్దరూ అద్భుతమైన నటులు అంటూ లవ్ ఎమోజిలు పోస్ట్ చేసారు సోను సూద్. దానితో అటు మహేష్, ఇటు విజయ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తూ ఆ ట్వీట్ ని మరింత వైరల్ చేస్తున్నారు.
Have worked with both.
Both are fab ❤️❤️ https://t.co/QpclTiKWT7— sonu sood (@SonuSood) June 13, 2023


