థాయిలాండ్ చెక్కేయనున్న నాని.

థాయిలాండ్ చెక్కేయనున్న నాని.

Published on Sep 13, 2019 11:28 AM IST

నాని హీరోగా దర్శకుడు విక్రమ్ కుమార్ తెరకెక్కించిన గ్యాంగ్ లీడర్ చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదలైంది. నాని తన తదుపరి చిత్రంగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “వి” లో నటిస్తున్న సంగతి తెలిసిందే. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని నెగెటివ్ షేడ్స్ కలిగిన సీరియల్ కిల్లర్ పాత్ర చేస్తున్నాడని సమాచారం. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు.

కాగా ఈ చిత్ర నెక్స్ట్ షెడ్యూల్ థాయిలాండ్ లో జరగనుందట. ఈ షెడ్యూలు లో పాల్గొనడానికి “వి” లో కీలక పాత్ర చేస్తున్న హీరో సుధీర్ బాబు ఇప్పటికే యూనిట్ తో కలిసి థాయిలాండ్ వెళ్లారట. నాని కూడా త్వరలో తాజా షెడ్యూల్ లో పాల్గొనడానికి అక్కడికి వెళ్లనున్నారని సమాచారం. ఈ షెడ్యూల్ లో సుధీర్, నాని పై కొన్ని కీలక సన్నివేశాలు దర్శకుడు మోహన కృష్ణ తెరకెక్కించనున్నాడు. ఇక ఈ చిత్రంలో నివేదా థామస్, అదితి రావ్ హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు