సూర్య సినిమాకు మరో అరుదైన గౌరవం

Published on May 14, 2021 2:01 am IST

ఈమధ్య కాలంలో విడుదలైన సినిమాల్లో బాగా ఆకట్టుకున్న చిత్రం ‘సూరరై పొట్రు’. సూర్య, అపర్ణ బాలమురళీ జంటగా నటించిన ఈ చిత్రాన్ని సుధా కొంగర డైరెక్ట్ చేశారు. ఓటీటీ ద్వారా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల్ని చాలా బాగా ఆకట్టుకుంది. సూర్యను హిట్ ట్రాక్ ఎక్కించడమే కాకుండా దర్శకురాలు సుధా కొంగరకు మరింత పేరును తెచ్చింది. సినిమా హక్కుల్ని దక్కించుకున్న ఓటీటీ సంస్థ కూడ మంచి లాభాల్ని చూసింది. ఆస్కార్ నామినేషన్లు కూడ ఎంపికైంది ఈ సినిమా.

గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుకల్లో సైతం ప్రదర్శితమైన ఈ సినిమా తాజాగా ఇంకో ఘనత సొంతం చేసుకుంది. షాంగై ఇంటర్నేషనల్ ఫిల్మ్
ఫెస్టివల్ లోని పనోరమా విభాగంలో చోటు దక్కించుకుంది. ఈ ఏడాది జూన్ 11 నుండి జూన్ 20 వరకు ఈ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది. ఐఎండీబీలో సైతం అత్యధిక రేటింగ్ పొందిన మూడవ సినిమాగా ఈ చిత్రం నిలిచింది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఆకాశం నీ హద్దురాగా’ పేరుతో అనువదించగా మంచి విజయాన్ని అందుకుంది. ‌ఏయిర్‌ డెక్కన్‌ సీఈఓ గోపినాథ్‌ జీవితకథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని సిఖ్య, 2డీ ఎంట‌ర్‌టైన్మెంట్ పతాకంపై సూర్య నిర్మించారు.

సంబంధిత సమాచారం :