భారత హాకీ క్రీడాకారుడు సంధీప్ సింగ్ జీవిత కథ ఆధారంగా హిందీ భాషలో తెరకెక్కిన చిత్రం ‘సూర్మ’. దేశం కోసం పథకం సాధించాలనే అనే లక్ష్యం తో ముందుకు సాగుతున్న క్రమంలో ఒక ప్రమాదంలో అతను పక్షవాతం భారిన పడతాడు. అదే సమయంలో తన ప్రేమను కూడా కోల్పోతాడు. ఈ పరిణామాలను అధిగమించి అతడు తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడనేదే ఈ చిత్ర కథ.
పంజాబీ నటుడు దిల్జిత్ దోషాన్జ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకులముందుకు వచ్చింది. మంచి రివ్యూస్ తో పాటు, మౌత్ టాక్ కూడా బాగుండడంతో మొదటి రోజు ఈ చిత్రం రూ.3.25 కోట్లను రాబట్టింది. తాప్సి పన్ను ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని షాద్ అలీ తెరకెక్కించారు. సోనీ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి శంకర్ ఎహసాన్ లాయ్ లు సంగీతం అందించారు.


