సూర్మ లేటెస్ట్ కలక్షన్స్ !

సూర్మ లేటెస్ట్ కలక్షన్స్ !

Published on Jul 16, 2018 5:31 PM IST

పంజాబీ నటుడు దిల్జిత్ దోషాన్జ్ ప్రధాన పాత్రలో హిందీ భాషలోతెరకెక్కిన చిత్రం’సూర్మ’. ఈ నెల13 న ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది. ఇక విడుదలైన మొదటి రోజు రూ.3.25 కోట్లను రాబట్టిన ఈ చిత్రం 3 రోజులకుగాను 13. 90 కోట్ల రూపాయలను ఖాతాలో వేసుకుంది. నిన్న ఒక్కరోజే ఈ చిత్రం 5.60 కోట్ల వసూళ్లను సాధించడం విశేషం. షాద్ అలీ తెరక్కించిన ఈ చిత్రానికి బాక్సాఫిస్ వద్ద ‘సంజు’ రూపంలో గట్టి పోటీ ఎదురవుతుంది.

భారత హాకీ క్రీడాకారుడు సంధీప్ సింగ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈచిత్రంలో ప్రముఖ నటి తాప్సి పన్ను ముఖ్య పాత్రలో నటించింది. సంగీత త్రయం శంకర్-ఎహసాన్ -లాయ్ లు సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ నిర్మించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు