స్వచ్చ భారత్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎస్.పి బాలు

స్వచ్చ భారత్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎస్.పి బాలు

Published on Jan 4, 2015 10:12 PM IST

SP-Balu
గత సంవత్సరం 150వ గాంధీ జయంతి కానుకగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన ‘స్వచ్చ భారత్ అభియాన్’ కార్యక్రమానికి దేశ నలుమూల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. మన రాష్ట్రాల్లో కూడా ఊపందుకోవడమే కాకుండా టాలీవుడ్ స్టార్స్ కూడా ఈ స్వచ్చ భారత్ లో జోరుగా పాల్గొని పలువురికి స్పూర్తిని ఇస్తున్నారు. అంతేకాకుండా గతేడాది, ఎక్కువమంది ఇంటర్నెట్ లో, సోషల్ మీడియా లో నెటిజన్లు ఎక్కువగా లైక్ లు కొట్టింది కూడా స్వచ్చభారత్ కె దక్కడం విశేషం.తాజాగా భారదేశంలో గానగంధర్వుడిగా పేరు తెచ్చుకున్న ఎస్.పి బాలసుబ్రహ్మణ్యంకి అరుదైన గౌరవం దక్కింది.

ఇక నుంచి స్వచ్చభారత్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మమణ్యంను నియమిస్తూ కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర పట్టాణాభివృద్ది శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు ఎస్పీ బాలసుబ్రహ్మమణ్యంకు లేఖ వ్రాశారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతగా చేసేందుకు తనవంతు కృషి చేస్తానని ఎస్పీ బాలసుబ్రహ్మమణ్యం తెలిపారు. మరి ఎస్.పి బాలసుబ్రమణ్యం ఏ మేరకు స్వచ్చ భారత్ ను ముందుకు తీసుకెళ్తారో చూడాలి..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు