‘దేవ్’ కోసం పాట పాడిన లెజెండరీ గాయకుడు !

‘దేవ్’ కోసం పాట పాడిన లెజెండరీ గాయకుడు !

Published on Oct 31, 2018 8:49 PM IST

spb

తమిళ హీరో కార్తీ , రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నూతన దర్శకుడు రజత్ రవి శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం దేవ్. అడ్వెంచర్ యాక్షన్ డ్రామా గా రానున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ , రమ్య కృష్ణ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర షూటింగ్ హిమాలయాల్లో జరిగింది. ఇక ఈ చిత్రంలోని ఒక పాటను ప్రముఖ గాయకుడు ఎస్ బి బాలసుబ్రమణ్యం పాడారు. హారిస్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు.

సుమారు 50కోట్ల బడ్జెట్ తో ప్రిన్స్ పిక్చర్స్ మరియు రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రం తెలుగులో కూడా విడుదలకానుంది. ఇక కార్తీ -రకుల్ కలిసి నటించడం ఇది రెండో సారి. గతంలో వీరిద్దరు కలిసి నటించిన ‘ఖాకి’ చిత్రం మంచి విజయం సాధించింది. రూపొందుతున్న ఈ చిత్రం తెలుగులో కూడా విడుదలకానుంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు