ప్రముఖ దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న చారిత్రాత్మక సినిమా ‘బాహుబలి’. నిన్న ముంబైలో జరిగిన కామిక్ కాన్ ఫెస్టివల్ లో పెద్ద హిట్ గా నిలిచింది. ఈ కార్యక్రమానికి రానా దగ్గుబాటి మరియు ఇతర టీం సభ్యులు హాజరయ్యారు. వారందరూ ‘బాహుబలి’ సినిమా గురించి మాట్లాడిన సమయంలో ప్రేక్షకుల నుండి అద్బుత స్పందన లభించింది. చప్పట్లతో ఉత్సాహపరిచారు.
ఈ ఫెస్టివల్ లో ‘బాహుబలి’ స్పెషల్ వీడియో ప్రదర్శించారు. వీడియో చూసిన తర్వాత అందరూ నిలబడి తమ గౌరవాన్ని తెలిపారు. ఇదే వీడియోను నేడు 10 గంటలకు విడుదల చేయనున్నారు. మూవీ మేకింగ్, భారి సెట్స్, విజువల్ ఎఫెక్ట్స్ గురించి ఈ వీడియోలో చూపించనున్నారు. ఈ వార్తను మూవీ యూనిట్ కి సంబందించిన వ్యక్తులు దృవీకరించారు. ట్విట్టర్ లో కూడా వెల్లడించారు.
వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను ఇప్పటి నుండే మొదలుపెట్టారు. సరికొత్త మార్కెటింగ్ టెక్నిక్స్ తో ‘బాహుబలి’ సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
