‘బ్రోచేవారెవరురా’ కోసం రామ్, నారా రోహిత్ !

Published on Jun 25, 2019 4:43 pm IST

శ్రీ విష్ణు హీరోగా నివేదా థామస్, నివేత పేతురాజ్ హీరోయిన్లుగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘బ్రోచేవారెవరురా’. ఓ కొత్తతరహా కామెడీ కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ మూవీ ఈ నెల 28న విడుదల కానుంది. అయితే ఈ చిత్రం యొక్క ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఈ రోజు జరుగనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ ఈవెంట్ కి ప్రత్యేక అతిథులుగా హీరో రామ్ మరియు నారా రోహిత్ లు వస్తోన్నారు. సహజంగా ఇలాంటి ఈవెంట్స్ కి కాస్త దూరంగా ఉండే రామ్.. ‘బ్రోచేవారెవరురా’ ఈవెంట్ కి వస్తుండటం విశేషం.

ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ మాదాపూర్ లోని సైబర్ కన్వెన్షన్స్ లో జరుగనుంది. ఇక ఈ సినిమాలో నివేదా థామస్ క్లాసికల్ డ్యాన్సర్ గా నటిస్తుంది. ఇక ఫస్ట్ సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ ఈ చిత్రాన్ని కూడా బాగా తెరకెక్కించాడట. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ, సత్య దేవ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మన్యం క్రీయేషన్స్ పతాకం ఫై మన్యం విజయ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More