సుకుమార్ సినిమాలో ఐటెం సాంగ్ కి ప్రత్యేక స్థానం వుంటుంది. దీనికి తారక్ కూడా మినహాయింపు కాదు. తాజా సమాచారం ప్రకారం తారక్ – సుకుమార్ సినిమాలో ఒక ప్రముఖ హీరోయిన్ ఐటెం సాంగ్ లో చిందేయనుందట.
అయితే ఫిలింనగర్ లో వినిపిస్తున్న వార్తలు ఏమిటంటే ఆ ఐటెం భామ మిల్కీ బ్యూటీ తమన్నానేనట. ఈ వార్తపై అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది. ఈ చిత్ర షూటింగ్ లండన్ లో ప్రారంభమయ్యింది. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్.


