విడుదలకు సిద్దమైన నటుడు అజ‌య్ ”స్పెష‌ల్” మూవీ.

విడుదలకు సిద్దమైన నటుడు అజ‌య్ ”స్పెష‌ల్” మూవీ.

Published on Jun 16, 2019 2:00 PM IST

ప్రతినాయకుడి పాత్రలతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్.గతంలో ‘సారాయి వీర్రాజు’, ‘దిక్కులు చూడకు రామయ్య’ వంటి సినిమాలలో కధానాయకుడిగా కూడా చేశారు. మళ్ళీ “స్పెషల్” అనే మూవీలో హీరోగా కనిపించనున్నారు నటుడు అజయ్. లవ్ రివెంజ్ స్టోరీ కాన్సెప్ట్ తో వస్తోన్న “స్పెషల్ ” సినిమాలో అజయ్ పోలీస్ ఆఫీసర్ గా చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి మోసం చేయడానికి కారణమైన వారిని పై పగ తీర్చుకొనే వ్యక్తి కథగా ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని 21 ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌క, నిర్మాత‌ వాస్త‌వ్ మాట్లాడుతూ. ల‌వ్‌, ఎమోష‌న్స్ అన్ని ఉన్న క‌థ ఇది. అజయ్ ఈ మూవీకి పెద్ద రాకెట్, ఇక అక్షిత ప్రధానమైన పాత్రలో చక్కగా నటించింది,బలమైన అలాగే డిఫరెంట్ స్క్రీన్ ప్లే ఈ మూవీకి ప్రధాన బలం అన్నారు. హీరోయిన్ అక్షిత‌ మాట్లాడుతూ చిన్నప్పటినుండి సస్పెన్సు థ్రిల్లర్స్ అంటే చాలా ఇష్టం. తెలుగు ప్రేక్షకుల అభిరుచులు మారాయి,హీరోయిన్ ప్రధానం గా వస్తున్న చిత్రాలు ఇష్టపడుతున్నారు. ఈ మూవీకి ఆర్ ఆర్ కూడా చక్కగా కుదిరింది అని చెప్పారు. చివరిగా “స్పెషల్” టీం కి విషెస్ చెప్పి ముగించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు