‘కళ్యాణ వైభోగమే’ ఆడియో లాంచ్ డీటైల్స్!

‘కళ్యాణ వైభోగమే’ ఆడియో లాంచ్ డీటైల్స్!

Published on Nov 18, 2015 9:18 PM IST

Kalyana-Vaibhogame
‘కళ్యాణ వైభోగమే’ అన్న పద ప్రయోగం వినగానే తెలుగులోనూ అందరినోళ్ళలోనూ, అన్ని పెళ్ళిల్లలోనూ మోగిన కళ్యాణ వైభోగమే అన్న పాట గుర్తుకువస్తుంది. తాజాగా అదే పేరుని తీసుకొని దర్శకురాలు నందిని రెడ్డి ఓ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. నాగ శౌర్య, మాళవిక నాయర్ జంటగా రూపొందుతోన్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. దీపావళి కానుకగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్ ఈ సినిమాపై ఆసక్తి పెంచేసింది.

ఇక తాజాగా ఆడియో రిలీజ్, టీజర్ రిలీజ్‌లకు సంబంధించి నందిని రెడ్డి స్పెషల్ ప్లాన్స్ చేస్తున్నారు. కళ్యాణ్ కోడూరి సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియోను ఈ నెల 28న గానీ, 29న గానీ విడుదల చేసేందుకు సినిమా యూనిట్ ప్లాన్ చేస్తోంది. పోస్టర్ రిలీజ్‌కి వస్తోన్న రెస్పాన్స్‌తో హ్యాపీగా ఉన్న నందిని రెడ్డి ఈ నెలాఖర్లో ఆడియోను రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించారు. డిసెంబర్ నెలలో సినిమా విడుదల కానుంది. రంజిత్ మూవీస్ పతాకంపై దామోదర ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు