ఎన్.టి.ఆర్ సినిమా కోసం స్పెషల్ పోలీస్ స్టేషన్ సెట్

ఎన్.టి.ఆర్ సినిమా కోసం స్పెషల్ పోలీస్ స్టేషన్ సెట్

Published on Oct 6, 2014 11:03 AM IST

Ntr
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా సెట్స్ పై ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఇందులో ఎన్.టి.ఆర్ ఫుల్ లెంగ్త్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.

మాకు అందిన తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర టీం బేగం పెట్ లో ఓ స్పెషల్ హౌస్ ని తీసుకొని దాన్ని పోలీస్ స్టేషన్ గా మార్చి సెట్ వేస్తున్నారు. ఈ సినిమాకి ఈ సెట్ లో షూట్ చేసే సీన్స్ చాలా కీలకం. అందుకే షూటింగ్ కి అనువుగా సెట్ ని రూపకల్పన చేస్తున్నారు. ఈ సెట్ కోసం బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ 27 లక్షలు ఖర్చు చేస్తున్నారు. 11 రోజుల పాటు షూటింగ్ జరిపే ఈ స్పెషల్ పోలీస్ స్టేషన్ సెట్లో సినిమాలోని కీ సీన్స్ ని షూట్ చేయనున్నారు.

ఎన్.టి.ఆర్ సరసన కాజల్ గర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గరలోనే ఉండడం వలన అనుకున్న టైంకి ఈ సినిమాని రిలీజ్ చెయ్యాలని ఈ చిత్ర టీం కంటిన్యూగా షూటింగ్ చేస్తోంది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమకి మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

తాజా వార్తలు