శర్వానంద్ సినిమా కోసం భారీ పోర్ట్ సెట్ !

శర్వానంద్ సినిమా కోసం భారీ పోర్ట్ సెట్ !

Published on May 3, 2018 12:47 PM IST

వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ హీరో శర్వానంద్ సుధీర్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 1980 నేపథ్యంలో సాగే కథగా ఈ సినిమా ఉండబోతోంది. ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ కోసం ప్రోడక్షన్ డిజైనర్ రవీందర్ 1980ల కాలాన్ని గుర్తుచేసేలా ప్రత్యేకమైన పోర్ట్ సెట్ ను రూపొందించారట.

ఈ సెట్లోనే కొన్ని కీలక సన్నివేశాలు, ఒక ఫైటింగ్ సీక్వెన్స్ ను షూట్ చేయనున్నారు. ఈ నెల 15 వరకు ఈ షెడ్యూల్ కొనసాగనుంది. కళ్యాణి పరియదర్శిని కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ సంస్థలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇది కాకుండా హను రాఘవాపుడి దర్శకత్వంలో ‘పడి పడి లేచె మనసు’ అనే సినిమా చేస్తున్నారు శర్వానంద్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు