పుష్ప కోసం హైదరాబాద్ లో ప్రత్యేక సెట్స్ ?

పుష్ప కోసం హైదరాబాద్ లో ప్రత్యేక సెట్స్ ?

Published on Feb 15, 2021 12:30 PM IST

దర్శకుడు సుకుమార్ పుష్ప కోసం రంగస్థలం పద్ధతి ఫాలో అవనున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. రంగస్థలం షూటింగ్ ని చాలా వరకు హైదరాబాద్ లోనే పూర్తి చేశారు సుక్కు. పీరియడ్ మూవీ కావడంతో హైదరాబాద్ లో ప్రత్యేకమైన విలేజ్ సెట్ వేసి సన్నివేశాలు చిత్రీకరించారు. విజువల్ గా అద్భుతం అనిపించిన రంగస్థలం ఇండస్ట్రీ హిట్ అందుకుంది. కాగా పుష్ప షూటింగ్ కూడా వీలైనంత వరకు సుకుమార్ హైదరాబాద్ లో వేసే సెట్స్ లో చిత్రీకరణ జరపాలని భావిస్తున్నారట.

బయట అటవీ ప్రాంతాల ఉన్న చోట్ల షూటింగ్ అనుకున్నంత స్పీడ్ గా అవ్వట్లేదని.. అందుకే హైదరాబాద్ లో ప్రత్యేక సెట్స్ వేయించి అక్కడే షూట్ చేయాలని ఫిక్స్ అయ్యాడట. ఇక గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే సన్నివేశాలు ఉంటాయని సమాచారం. ఇప్పటికే చిత్రీకరణ ఆలస్యం అయిన నేపథ్యంలో త్వరగా మూవీ పూర్తి చేసే ఆలోచనలో సుకుమార్ ఉన్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు