హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ షూట్ లో నాగ చైతన్య

Naga-Chaitanya
‘దోచేయ్’ సినిమా తర్వాత అక్కినేని నాగ చైతన్య తన కెరీర్లో తొలి బిగ్ హిట్ అయిన ‘ఏం మాయ చేసావే’ సినిమా చేసిన గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఇటీవలే చెన్నైలో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మలయాళ నటి మంజిమ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ నేటి నుంచి చెన్నైలో ప్రారంభం కానుంది. అది కూడా నాగ చైతన్య పై హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ని షూట్ చేయనున్నారు. మొదటి షెడ్యూల్ లో ఈ సినిమా 50% షూటింగ్ ఫినిష్ చేసారు. నేటి నుంచి మొదలైన సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ఫినిష్ అయ్యేంతవరకూ జరగనుంది.

టాలీవుడ్ ఫేమస్ రైటర్ కోన వెంకట్ ఈ సినిమాని తెలుగులో నిర్మిస్తున్నాడు. ‘నేటి నుంచి చైతన్య మూవీ సెకండ్ షెడ్యూల్. 50% షూట్ పూర్తయింది. నేటి నుంచి రోమాలు నిక్కబొడుచుకునే కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ని షూట్ చేయనున్నారు. చైతన్య న్యూ అవతార్ మరియు పెర్ఫార్మన్స్ అందరినీ సర్ప్రైజ్ చేస్తుంది. గౌతమ్ మీనన్ మార్క్ యాక్షన్ ఉండే లవ్ స్టొరీ ఇది. ఎఆర్ రెహమాన్ ట్యూన్స్ స్పెషల్ హైలైట్ అవుతాయని’ కోన వెంకట్ తెలిపాడు. గౌతమ్ మీనన్ ఈ సినిమాని ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. తమిళ్ లో శింబు హీరోగా నటిస్తున్నాడు.

Exit mobile version