ఎన్టీఆర్ ను వెతికే పనిలో చరణ్ ?

ఎన్టీఆర్ ను వెతికే పనిలో చరణ్ ?

Published on Jan 22, 2019 1:03 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్ (వర్కింగ్ టైటిల్). అగ్ర దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈచిత్రం ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. నిన్నటి నుండి ఈ చిత్రం యొక్క రెండవ షెడ్యూల్ ప్రారంభమైంది. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ , రామ్ చరణ్ పాత్రలఫై రకరకాల ఊహాగానాలు వెలుబడతున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ అడివి దొంగ కాగా ఆయనను పట్టుకొనే పనిలో చరణ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

ఇక అలాగే ఈచిత్రంలో ముగ్గురు కథానాయికలు నటించనున్నారని త్వరలోనే వారి పేర్లను అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. భారీ బడ్జెట్ తో దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా బుర్రా సాయి మాధవ్ మాటలు రాస్తున్నారు.

ఇక ఈ చిత్రం యొక్క శాటిలైట్ రైట్స్ కోసం ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ప్రముఖ టెలివిజన్ నెట్ వర్క్ జీ టీవీ ఈచిత్రం యొక్క హిందీ ,తెలుగు , తమిళం శాటిలైట్ రైట్స్ కోసం సుమారు 150కోట్లు కోట్ చేసిందని టాక్. అయితే దానయ్య మాత్రం ఈ ఆఫర్ ను హోల్డ్ లో పెట్టారట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు