“ఎండ్ గేమ్” ని క్రాస్ చేసి భారీ రెస్పాన్స్ కొల్లగొట్టిన ‘స్పైడర్ మ్యాన్’

Published on Aug 26, 2021 7:25 am IST


పలు హాలీవుడ్ చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉంది. అలాగే మన దేశంలో కూడా ఎంతో క్రేజ్ ఉన్న చిత్రాల్లో మర్వెల్ మూవీస్ కూడా ఒకటి. సూపర్ హీరోస్ సినిమాలను ఎప్పటికప్పుడు సరికొత్తగా అందించే ఫ్రాంచైజ్ మార్వెల్ స్టూడియోస్ నుంచి ఇప్పటికే ఎన్నో చిత్రాలు ప్రపంచ బాక్స్ ఆఫీస్ ని కొల్లగొట్టాయి. అయితే వీరి నుంచి వచ్చిన “అవేంజెర్స్ ఎండ్ గేమ్” చిత్రం చాలానే రికార్డులు సృష్టించింది.

ఇప్పుడు దాని ట్రైలర్ రిలీజ్ రికార్డ్స్ ని లేటెస్ట్ గా వచ్చిన “స్పైడర్ మ్యాన్ నో వే హోమ్” చిత్రం ట్రైలర్ బ్రేక్ చేస్తుండడం గమనార్హం. ఒక్కరోజులో మొత్తం సోషల్ మీడియాలో అన్ని రికార్డ్స్ ని ఈ ట్రైలర్ బ్రేక్ చేసింది. సోషల్ మీడియా అన్నింటిలో ఎండ్ గేమ్ కు 289 మిలియన్ భారీ వ్యూస్ రాగా నో వే హోమ్ కి ఏకంగా 355.5 మిలియన్ వ్యూస్ వచ్చినట్టు తెలుస్తోంది.

దీనితో ఎండ్ గేమ్ లాంటి సినిమా రికార్డ్ ని బ్రేక్ చేసిన చిత్రంగా ఇది నిలిచింది. అయితే దీనికి కారణం ఎప్పుడు నుంచో ఈ ట్రైలర్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండడమే కాకుండా సోనీ పిక్చర్స్ నుంచి ముందే లీక్ అవ్వడంతో మరింత క్రేజ్ పెరిగింది. పైగా ఇది మల్టీవర్స్ కాన్సెప్ట్ తో ఉండడం ముందు స్పైడర్ మ్యాన్ విలన్స్ అందరూ ఇందులో రానుండడం వంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు దీనిపై ఎంతో క్రేజ్ తెచ్చిపెట్టాయి. అందుకే ఈ సినిమాకి ఇప్పుడు స్పెషల్ క్రేజ్ ఏర్పడింది.

సంబంధిత సమాచారం :